ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Neem leaves | వేప ఆకుతో చ‌ర్మం నిగారింపు.. జుట్టు స‌మ‌స్య‌లూ దూరం

    Neem leaves | వేప ఆకుతో చ‌ర్మం నిగారింపు.. జుట్టు స‌మ‌స్య‌లూ దూరం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Neem leaves | వేప ఎన్నో దివ్యౌష‌ధ గుణాలు క‌లిగి ఉంది. తిన‌డానికి చేదుగానే ఉన్నా ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లిగిస్తుంది. వేప ఆకులు (neem leaves) అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను (health problems) దూరం చేస్తాయి. ప్ర‌ధానంగా చ‌ర్మం నిగారించేలా (skin problems) చేయ‌డంతో పాటు జుట్టు రాలే స‌మ‌స్య‌ను (hair lose) అరిక‌డుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతున్నారు. అలాగే జుట్టు రాలే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు డాక్ట‌ర్లు, వైద్య నిపుణుల వ‌ద్ద‌కు పరుగెడుతున్నారు. మందులు, షాంపులు అంటూ ఏవేవో రుద్దుతూ డ‌బ్బు వృథా చేస్తున్నారు త‌ప్పితే పెద్ద‌గా ఫ‌లితం ఉండ‌డం లేదు. అయితే, మ‌నంద‌రికీ అందుబాటులో ఉచితంగా దొరికే వేప ఆకుల‌తో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు (ayurvedic experts) చెబుతున్నారు. వేప ఆకుల‌తో ముఖ కాంతి మెరుస్తుంద‌ని, జుట్టు రాలే స‌మ‌స్య (hair lose) కూడా పోతుంద‌ని పేర్కొంటున్నారు. పురాత‌న కాలం నుంచే వేప ఆకుల వైద్యం (neem leaves treatment) అందుబాటులో ఉంద‌ని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు దూరం చేసుకోవ‌చ్చ‌ని సూచిస్తున్నారు.

    Neem leaves | ప్రయోజనాలెన్నో..

    వేప ఆకులను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ప్ర‌ధానంగా వేప ఆకుల‌ను దంచి ముఖానికి రాస్తే మొటిమలు, పిగ్మెంటేషన్, మచ్చలు తొలగిపోతాయి. వేపలో యాంటీ బాక్టీరియల్స్ (antibacterial) ఉంటాయి. ఇది ముఖ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖం శుభ్రంగా కనిపించేలా చేస్తుంది.

    Neem leaves | ఎలా ఉపయోగించాలంటే..

    ముందుగా వేప ఆకులను (neem leaves) తెంపి నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి. ఆ తరువాత ఈ ఆకులను నీటిలో బాగా మరిగించాలి అనంత‌రం ఆ ఆకులను రుబ్బి (grind) పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చ‌ల్ల‌ని నీటితో కడుక్కోవాలి. దీంతో మొటిమలు, పిగ్మెంటేషన్, మచ్చలు వంటివి పోతాయి. ముఖం నిగారిస్తుంది.

    Neem leaves | జుట్టుకు సైతం..

    జుట్టు రాలే స‌మ‌స్య‌తో (hair lose) బాధ ప‌డేవారికి వేప దివ్యౌష‌ధం. అలాగే, చుండ్రు, దురద సమస్యను తొలగించడంలో వేప ఆకులు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు (antibacterial properties) కనిపిస్తాయి. ఇవి చర్మ అలెర్జీలు, చికాకు (skin allergies and irritation) నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేపను ఉపయోగించడం వల్ల జుట్టు నుండి చుండ్రు కూడా తగ్గుతుంది.

    వేప ఆకులను శుభ్రం చేసి, వేడి నీటిలో (hot water) బాగా మరిగించాలి. తరువాత, ఆకులను రుబ్బి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె కలపండి. ఈ పేస్ట్ ని జుట్టు మీద అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోండి. చుండ్రు వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. అలాగే, జుట్టు రాలే స‌మ‌స్య శాశ్వ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...