అక్షరటుడే, కామారెడ్డి : Neelam Kalavathi Ramesh Campaign | మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం దేవునిపల్లి గ్రామంలో (Devunipalli Village) తన భర్త రమేష్తో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Neelam Kalavathi Ramesh Campaign | అవ్వా.. నీ ఓటు నాకే వేయాలి..
అవ్వా.. నీ ఓటు నాకే వేయాలి.. అంటూ వృద్ధులు, మహిళా ఓటర్లను కళావతి రమేష్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డు ప్రజల సమగ్రాభివృద్ధికి ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలవడం కోసం మేనిఫెస్టో తయారు చేయలేదని, గెలిచిన తర్వాత మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.
నిలదీసే అధికారం ప్రజలకు ఉంది..
ఒక్కహామీ అమలు చేయకున్నా తమను నిలదీసే హక్కు ప్రజలకు ఉందని నీలం కళావతి రమేష్ అన్నారు. వార్డు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. నిరుపేద కుటుంబాలను ఆదుకుంటామని, వారి పిల్లల చదువుకు బాసటగా నిలుస్తానని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధికి ప్రత్యేక నిధులను తీసుకువస్తానన్నారు. మాటఇస్తే మర్చిపోనని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
