Neelam Chinna Rajulu | ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉంది..: బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు

అక్షరటుడే, కామారెడ్డి: Neelam Chinna Rajulu | కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. Neelam Chinna Rajulu | కాంగ్రెస్​ నాయకుడు కారుతో వచ్చి.. వందల మంది పోలీసుల కళ్లుగప్పి శనివారం నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు కారుతో వచ్చి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించాడని చిన్నరాజులు అన్నారు. జిల్లా […]

అక్షరటుడే, కామారెడ్డి: Neelam Chinna Rajulu | కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి ప్రాణహాని ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Neelam Chinna Rajulu | కాంగ్రెస్​ నాయకుడు కారుతో వచ్చి..

వందల మంది పోలీసుల కళ్లుగప్పి శనివారం నాడు ఓ కాంగ్రెస్ నాయకుడు కారుతో వచ్చి క్యాంప్ కార్యాలయంపై దాడికి యత్నించాడని చిన్నరాజులు అన్నారు. జిల్లా ఎస్పీ సూచనతో ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటే కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడారని తెలిపారు. తమ ఎమ్మెల్యేపై ఈగ వాలినా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు నీతి, నిజాయితీ ఉంటే సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వద్దకు డాక్యుమెంట్లతో వచ్చి ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ చేశారు. తప్పు ఉంటే కలెక్టర్ ఎదుటే స్పీకర్​కు ఫోన్ చేసి రాజీనామా ఇస్తానని ఎమ్మెల్యే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి సమస్య పరిష్కరించాలని, ఇక్కడితో ఈ అంశాన్ని ముగించాలని సూచించారు. కాదు కూడదు ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తామంటే తాము కూడా సిద్ధంగా ఉంటామని చెప్పారు. తమ ఎమ్మెల్యేకు ప్రాణహాని ఉందని, ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. రక్షణ కల్పించకుండా తాత్సారం చేస్తే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumar
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2006 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy College Land Dispute | కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర...

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

​అక్షరటుడే, భీమ్​గల్ : Vemula Prashanth Reddy Protest | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే...

Revanth Reddy Projects Completion | రెండేళ్లలో పెండింగ్​ ప్రాజెక్ట్​లు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Projects Completion | రాష్ట్రంలో పెండింగ్​ ప్రాజెక్ట్​లను రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి  (CM Revanth...