అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | మొబైల్స్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని.. ప్రతిఒక్కరూ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. గత 15 రోజుల్లో పోగొట్టుకున్న 143 మొబైళ్లను రికవరీ చేయగా జిల్లా పోలీస్ కార్యాలయంలో (district police office) ఎస్పీ మంగళవారం వివరాలు వెల్లడించారు.
ఈ ఏడాది రూ.2.75 కోట్ల విలువైన 1,722 మొబైళ్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. ప్రతినెలా స్పెషల్ డ్రైవ్ ద్వారా 150కి పైగా ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు. సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం రూ.6.67 కోట్ల విలువైన 4,269 మొబైళ్ల (mobile phones) రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. బాధితులు ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఈఐఆర్ పోర్టల్ (CEIR portal) ద్వారా ఫోన్ను తిరిగి పొందవచ్చని పేర్కొన్నారు. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ల రికవరీలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
