Yendala Arrest | యెండల లక్ష్మీనారాయణ అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ ఇన్​ఛార్జి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నసురుల్లాబాద్ మండలం అంకోల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకొని నిజామాబాద్​ (Nizamabad)లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. యెండల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయన్నారు. బాన్సువాడలో జరిగిన […]

అక్షరటుడే, బాన్సువాడ : Yendala Arrest | బాన్సువాడ (Banswada) పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తున్న బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ ఇన్​ఛార్జి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ (Yendala Lakshminarayana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నసురుల్లాబాద్ మండలం అంకోల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకొని నిజామాబాద్​ (Nizamabad)లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు.

యెండల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయన్నారు. బాన్సువాడలో జరిగిన రాళ్లదాడుల ఘటనలో అసలు దోషులను అరెస్ట్ చేయకుండా, హిందువులనే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. పోలీసులు రాజకీయ ఒత్తిడికిలోనై బాధితులపైనే వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హిందువులపై రాళ్లదాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే బాన్సువాడ నియోజకవర్గం మొత్తం నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...

Harish Rao Criticizes Revanth | సీఎం చేసిందేమి లేదు.. కూల్చిందే ఎక్కువ : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Criticizes Revanth | కాంగ్రెస్​ ప్రభుత్వం, సీఎం రేవంత్​రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శలు చేశారు. రెండేళ్ల...

RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

అక్షరటుడే, మెండోరా : RTC Bus Accident Mendora | ఆర్టీసీ బస్సు (RTC Bus) ఢీకొని వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ...

Ramchander Rao Arrest | బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అరెస్ట్..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ramchander Rao Arrest | బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావును పోలీసులు అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ...