HomeజాతీయంBihar Elections | బీహార్‌లో కొలిక్కివచ్చిన ఎన్డీఏ సీట్ల సర్దుబాటు.. బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ...

Bihar Elections | బీహార్‌లో కొలిక్కివచ్చిన ఎన్డీఏ సీట్ల సర్దుబాటు.. బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందంటే?

Bihar Elections | బీహార్​ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఎన్డీఏ కూటమిలోని పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీజేపీ, జేడీయూ సమాన స్థానాల్లో పోటీ చేయనున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar Elections | బీహార్​లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ (NDA) భావిస్తుండగా.. జేడీయూ, కాంగ్రెస్​ కూటమి సైతం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై కీలక ప్రకటన వచ్చింది.

బీహార్​లో మొత్తం 243 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్​ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా.. 14న కౌంటింగ్​ నిర్వహించనున్నారు. ఇక్కడ బీజేపీ (BJP), జేడీయూ (JDU), ఎల్​జేపీ(ఆర్​), ఆర్ఎల్‌ఎం, హెచ్​ఏఎం కలిసి పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్​, ఆర్జేడీతో పాటు పలు పార్టీలు జత కట్టాయి. ఈ క్రమంలో ఆదివారం ఎన్డీఏ పార్టీల మధ్య సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, జేడీయూ సమాన సీట్లలో పోటీ చేయనున్నాయి.

Bihar Elections | బీజేపీ, జేడీయూ సమానంగా..

బీహార్​ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ సమాన స్థానాల్లో పోటీ చేయనున్నాయి. బీజేపీకి 101 సీట్లు, జేడీయూ 101, LJP(R)కి 29, ఆర్ఎల్‌ఎంకి 6, హెచ్‌ఏఎంకి 6 సీట్లు కేటాయించారు. చాలా కాలం పాటు జరిగిన చర్చల అనంతరం అన్ని పార్టీలు ఈ సీట్ల పంపకానికి ఓకే చెప్పాయి. బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్, జేడీయూ నేత సంజయ్ ఝా ఈ మేరకు సోషల్​ మీడియాలో సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేశారు. బీహార్​లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ధర్మేంద్ర ప్రధాన్​ అన్నారు.

Bihar Elections | సీట్లను వదులుకున్న జేడీయూ

గత ఎన్నికలలో సీట్ల పంపకాలతో పోలిస్తే జేడీయూ 14 సీట్లు, BJP 9 సీట్లు కోల్పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్లలో LJP కి ఏ సీట్లను వదులుకోకూడదని జేడీయూ మొదట భావించింది. అయితే చర్చల అనంతరం వెనక్కి తగ్గింది. సీట్ల పంపకాల జేడీయూ నాయకుడు సంజయ్ ఝా మాట్లాడుతూ.. మంచి వాతావరణంలో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై ఎన్డీఏ పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను భారీ మెజారిటీతో తిరిగి ఎన్నుకోవడానికి దృఢ నిశ్చయంతో మరియు ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

కాగా కాంగ్రెస్​, ఆర్జేడీ, ఇతర పార్టీలు కలిసి బీహార్​లో మహాఘటబంధన్ పేరుతో పోటీ చేయనున్నాయి. అయితే అవి ఇంకా సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.