అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ చేపడుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అధికార ఎన్డీఏ కూటమి (NDA alliance) ఆధిక్యంలో సాగుతోంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 142 స్థానాల్లో లీడ్లో ఉంది. విపక్ష మహఘట్బంధన్ కూటమి 81 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసురాజ్ పార్టీ (Janasuraj Party) ఒక స్థానంలో, ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
