అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bihar Election Counting | బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. కూటమి సుమారు 190 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మహాగఠ్ బంధన్ (Mahagath Bandhan) (ఎంజీబీ) కూటమి కేవలం 50 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇక జనసురాజ్ పార్టీ (Janasuraj Party) అయితే ఒకటి రెండు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
Bihar Election Counting | అతిపెద్ద పార్టీగా..
ఎన్డీయే అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. కాగా.. అతిపెద్ద పార్టీ బీజేపీ (BJP) అవతరించనుంది. ఇప్పటికే ఆ పార్టీ 84 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా.. జేడీయూ 75 స్థానాల్లో ముందుంది. ఎల్జీపీ (ఆర్వీ) 21 స్థానాలు, హెచ్ఏఎం (ఎస్) 4 స్థానలు, ఆర్ఎల్ఎం 4 చోట్ల ముందంజలో ఉన్నాయి. మరో వైపు ఎంజీబీ కూటమిలోని ఆర్జేడీ (RJD) 34 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా.. కాంగ్రెస్ (Congress) సింగిల్ డిజిట్‌కు పరిమితం అయ్యింది. ఆ పార్టీ కేవలం ఏడు స్థానాల్లో ముందుంది. సీపీఐ(ఎంఎల్) 5 స్థానాలు, సీపీఐ ఒక స్థానం, వీఐపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు ఐదు చోట్ల ముందంజలో ఉన్నారు.
