HomeతెలంగాణNCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

NCC Students | ఎన్​సీసీ విద్యార్థుల ప్లకార్డుల ప్రదర్శన

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: NCC Students | జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ఎన్​సీసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఎంబీబీఎస్​లో (MBBS) ఒక్కశాతం ఎన్​సీసీ కోటా రిజర్వేషన్​ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్​ కల్పించాలంటూ ఫ్లకార్డులను ప్రదర్శించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటికి పంపించేశారు. ఎన్​సీసీ విద్యార్థులంతా వరంగల్ నుంచి వచ్చినట్లు తెలిసింది.

Must Read
Related News