అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hockey Team | ఆసియా కప్ టైటిల్‌ను గెలుపొందిన పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి సభ్యుడికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బంది రూ.1.5 లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపింది.
నాల్గవ ఆసియా కప్ టోర్నీలో భారత హాకీ జట్టు(Hockey Team) ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాను 4-1 తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసింది. సుఖ్జీత్ సింగ్(Sukhjeet Singh) మొదటి నిమిషంలోనే గోల్ చేయడంతో ఇండియా ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత కూడా దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి ఘన సాధించింది. ఈ నేపథ్యంలో జట్టు సభ్యులపై హాకీ ఇండియా ప్రశంసలు కురిపించింది. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల రివార్డును ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
Hockey Team | ప్రపంచ కప్‌కు అర్హత
ఆసియా కప్(Asia Cup) టైటిల్ కోసం ఎనిమిదేళ్ల నిరీక్షణకు భారత్ జట్టు ముగింపు పలికింది. అలాగే, అత్యధికంగా టైటిల్ సాధించిన దేశంగా అవతరంచింది. నాలుగు సార్లు గెలిచిన పాకిస్థాన్(Pakistan)ను అధిగమించి ఇండియా ఐదుసార్లు విజయం సాధించి జట్టుగా నిలిచింది. కొరియా కూడా ఐదుసార్లు కప్ సొంతం చేసుకుంది. భారత్ ప్రస్తుత విజయంతో వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరుగనున్న హాకీ ప్రపంచ కప్‌కు అర్హత సాధించిందిన ఎనిమిదో జట్టుగా కూడా నిలిచింది. బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, స్పెయిన్, FIH హాకీ ప్రో లీగ్ మునుపటి రెండు ఎడిషన్‌ల ద్వారా అర్హత సాధించాయి. అర్జెంటీనా పాన్ అమెరికన్ కప్ ద్వారా అర్హత సాధించింది, జర్మనీ యూరోహాకీ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ ఓషియానియా కప్ ద్వారా అర్హత సాధించింది. మొత్తం 16 జట్లు పోటీలో పాల్గొంటాయి,