అక్షరటుడే, ముప్కాల్: Kothapally | ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాయక్‌పోడ్ భీమన్న (Nayakpod Bhimanna) ఉత్సవాలు మండలంలోని కొత్తపల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజలు, ఆదివాసీ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భీమన్న దేవునికి ప్రత్యేక పూజలు చేశారు.
Kothapally | డప్పు చప్పుళ్లు.. నృత్యాల మధ్య..
భీమన్న గుడి (Bhimanna Temple) వద్దకు అదివాసీ పెద్దలు, యువత అంతా కలిసి భీమన్న గుడికి ఊరేగింపుగా వెళ్లారు. దారిపొడవునా డప్పు చప్పుళ్ల మధ్య, నృత్యాలు చేస్తూ ఆలయానికి బయలుదేరారు. శనివారం భీమన్న గజ్జలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించనున్నారు. ఆదివారం ఉత్సవాల చివరి రోజు భీమన్న గజ్జల కల్యాణ మహోత్సవం (Bhimanna Gajjala Kalyana Mahotsavam), అలాగే అగ్గి గుండం ఏర్పాటు చేసి సంప్రదాయ రీతిలో కార్యక్రమాలు జరుగనున్నాయి. చివరిగా గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న భీమన్న ఉత్సవాల నిమిత్తం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల పరంగా కొత్తపల్లి (Kothapally) గ్రామంలో సందడి నెలకొంది.
