Navodaya Notification | నవోదయ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే..
Navodaya Notification | నవోదయ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Navodaya Notification : నవోదయ విద్యాలయంలో (NVS) 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. జవహర్ నవోదయ విద్యాలయ సమితి (Jawahar Navodaya Vidyalaya Samiti – JNVS) 2026-27 ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

నవోదయ విద్యాలయాల్లోని 653 సీట్లను భర్తీ చేయనుంది. జూన్ 15 నుంచి జులై 29లోగా ఆన్​లైన్​(navodaya gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుము అవసరం లేదు. 1 మే 2014 నుంచి 31 జులై 2016 మధ్య జన్మించినవారు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి అర్హులు. జనవరి 17న ఫేస్ 1 ఏప్రిల్ 11న ఫేస్​ 2 పరీక్షలు ఉంటాయి.

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థి ఫొటో, విద్యార్థితోపాటు సంరక్షకుని సంతకం, ఆధార్(Aadhaar) నంబరు వివరాలు, ధ్రువీకరణ పత్రాల కాపీలు అప్​లోడ్​ చేయాలి.

నవోదయ విద్యాలయాల్లో(Navodaya Vidyalayam) చదువు, వసతి, ఆహారం, పుస్తకాలు, యూనిఫామ్ వంటివి పూర్తిగా ఉచితంగా ఉంటాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు అభివృద్ధి నిధిగా కొంత మొత్తంలో మాత్రమే తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. 75% సీట్లు గ్రామీణ విద్యార్థులకు కేటాయిస్తారు.