అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Naveen Yadav | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా వి.నవీన్ యాదవ్ (MLA Naveen Yadav) బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ప్రమాణం చేయించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) నవీన్ యాదవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరిగిన పోరులో హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన మాగంటి గోపినాథ్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. బీఆర్ఎస్ తన అభ్యర్థిగా గోపినాథ్ సతీమణి సునీతను బరిలో దింపింది. నవంబర్ 11న ఎన్నిక జరగ్గా 14న ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా.. అన్ని రౌండ్లలో నవీన్ యాదవ్ ఆధిక్యం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన దీపక్‌రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.
తాజాగా నవీన్ యాదవ్ స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి అజారుద్దీన్ (Minister Hazaruddin), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావుర, మేయర్ విజయలక్ష్మి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.