అక్షరటుడే, ఇందూరు : Nizamabad City | నగరంలోని పాత కలెక్టరేట్ (Old Collectorate) ప్రాంగణంలో నవదుర్గా మాత ఆలయ (Navadurga Mata Temple) ఐదో వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యజ్ఙం చేశారు.
ఉత్సవాలకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కమిటీ కార్యదర్శి అమృత్కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ, కోశాధికారి సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు పెద్దోళ్ల నాగరాజు, ఉమా కిరణ్, సత్యం, గంధం వెంకటేశ్వర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
