అక్షరటుడే, ఇందూరు: National Turmeric Board | దేశంలో పసుపు రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర పొందేందుకు పుష్కలంగా మార్కెటింగ్ అవకాశాలున్నాయని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (Chairman Palle Gangareddy) అన్నారు. మైసూర్లో (Mysuru) గురువారం జరిగిన బయ్కర్–సెల్లర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు.
National Turmeric Board | భవిష్యత్ మార్కెటింగ్‌పై..
పసుపు రైతుల (turmeric farmers) కష్టాన్ని, శ్రమను గుర్తించి వారికి మార్కెట్లో సరైన గిట్టుబాటు కల్పించేందుకు పసుపు బోర్డు కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని నమ్మి.. పసుపుబోర్డు ద్వారా ప్రతిఒక్క రైతుకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మార్కెటింగ్‌లో లోటుపాట్లను తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివకుమార్, ఎమ్మెల్సీ మంజా గౌడ్, టర్మరిక్ బోర్డు డైరెక్టర్ విష్ణువర్ధన్, చేతన్ కుమార్, ఇరప్ప, స్పైస్ బోర్డు డైరెక్టర్ ఎం.వై. హానర్ తదితరులు పాల్గొన్నారు.