అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | అఖిలభారత జాతీయ ఓబీసీ పదో మహాసభ (National OBC 10th Congress) గోవాలో నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Narala Sudhakar) తెలిపారు.
నగరంలోని కార్యాలయంలో గురువారం గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల్ డే (Mandal Day) సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహాసభలు (OBC National Conferences) నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ ఏడాది సైతం ఆగస్టు 7న గోవాలో సభ జరుగనున్నట్లు వివరించారు.
దేశవ్యాప్తంగా కులగణన (Caste census) చేపట్టే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం ఇవ్వాలనుకున్న రిజర్వేషన్ను కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్, దేవేందర్, శంకర్, అన్నయ్య, శ్రీలత, అజయ్, విజయ్, చంద్రకాంత్, బాలన్న, సదానంద తదితరులు పాల్గొన్నారు.