అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Government Medical College | నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు జాతీయస్థాయిలో (National Level) తమ ప్రతిభ చాటారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులు (MBBS Students) బోయిండల సూర్య, శశాంత్ కుమార్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎంఐడీ–డర్మకాన్2025లో పాల్గొన్నారు.
అక్కడ నిర్వహించిన డీవీఎల్–యూజీ డెర్మటాలజీ క్విజ్‌లో (DVL–UG Dermatology Quiz) వీరు రెండోస్థానం సాధించారు. ఈ క్విజ్‌కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలు ఆగస్టు నెలలో ఆన్‌లైన్‌లో నిర్వహించగా, దేశవ్యాప్తంగా 100కి పైగా బృందాలు పాల్గొన్నాయి.
వాటిలో నుంచి 5 బృందాలు మాత్రమే జాతీయ ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి. అందులో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు (Nizamabad Medical College Students) మెరుగైన ప్రదర్శన కనబర్చి రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ డీఎంఈ ఎన్. కృష్ణ మోహన్, కళాశాల డెర్మటాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ రామ్మోహన్ తదితరులు విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయిలో జిల్లా మెడికల్ కళాశాల పేరును నిలబెట్టారని ప్రశంసించారు.