అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నగరంలో గురువారం జాతీయ చేనేత కార్మిక దినోత్సవం (National Handloom Workers Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ చేనేత కార్మికులను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
జిల్లా అధ్యక్షుడు మైసల నారాయణ (District President Maisala Narayana) మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సొంత ఇల్లు, రేషన్ కార్డులు లేని వారు సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న చేనేత కార్మికులకు కనీస వేతనం అందజేయాలని ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గుద్దేటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సబ్బని ప్రసాద్, కోశాధికారి బాల్ రాజు, నగర అధ్యక్షుడు పెంట దత్తాద్రి, ప్రధాన కార్యదర్శి భూమేశ్వర్, కోశాధికారి సాయిలు, కొండ లక్ష్మణ్ బాపూజీ కమిటీ సలహాదారులు బీమర్తి రవి, గెంట్యాల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులు గాలిపల్లి నారాయణ, అంకం జగదీశ్వర్, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ, చేనేత పద్మ సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సిలివేరి గణేష్, మార్కండేయ కమిటీ అధ్యక్షుడు భీమర్తి సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Handloom Workers Day | ఫొటోలు దిగే విషయంలో ఇరు వర్గాల మధ్య రభస
చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని చేనేత కార్మిక భవనం (Handloom Workers Building)లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రెండు గ్రూపుల మధ్య రభస చోటుచేసుకుంది. సన్మానం అనంతరం ఫోటోలు దిగే విషయంలో నగర పట్టణానికి చెందిన మాజీ నాయకులు, చేనేత పద్మ సమైక్య నాయకుల మధ్య గొడవ తలెత్తింది.
Handloom Workers Day | రద్దయిన ఎమ్మెల్యే ప్రోగ్రాం..
బీజేపీ ఓబీసీ మోర్చా (BJP OBC Morcha) ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో కార్మికులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanapal Suryanarayana Gupta) చేతుల మీదుగా సన్మానించాలి. కానీ ఆయన రాకకు ముందే చేనేత కార్మిక సంఘం ప్రతినిధులు సన్మానించారు. అప్పటికే ఇక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులు నాగరాజు వారితో వాదించారు. ఎమ్మెల్యేను ముఖ్య అతిథిగా పిలిచిన తర్వాత ఆయన రాకముందే ఎలా సన్మానిస్తారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కార్మికులను ఆయన క్యాంపు కార్యాలయానికి పిలుచుకుని సన్మానించారు.