అక్షరటుడే, నెట్వర్క్: Congress Party | ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని (National Congress Party foundation day) ఘంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు. అనంతరం ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
Congress Party | కమ్మర్‌పల్లిలో..
మండల కేంద్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గద్దె వద్ద కాంగ్రెస్ జెండాను బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేయడం అన్యాయమని సునీల్కుమర్ పేర్కొన్నార. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (All India Congress Committee) పిలుపు మేరకు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తిరిగి చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ల పాల్గొన్నారు.
Congress Party | మెండోరాలో..

అక్షరటుడే, మెండోరా: మెండోరాలో (Mendora) కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాల్కొండ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Congress Party | ముప్కాల్‌లో..

అక్షరటుడే, ముప్కాల్: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మగ్గిడి ముత్యం రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి చందా రవి, కిసాన్ ఖేత్ అధ్యక్షుడు బద్దం సాగర్, డీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం చిన్నారెడ్డి, సీనియర్ నాయకుడు ముస్కు మోహన్, యూత్ అధ్యక్షుడు ధనుష్ యాదవ్‌తో పాటు ముత్యం రెడ్డి, ఏలేటి రాములు, మల్లారెడ్డి, నర్సారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మయూర్ తదితరులు పాల్గొన్నారు.
Congress Party | వర్ని మండల కేంద్రంలో..

అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండల (Varni mandal) కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం సిగ్గుచేటన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న చిల్లర రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, మహమ్మద్ భారీ, గిరి, సర్పంచ్‌లు కనకదుర్గ రవి, పెద్ద సాయులు, ఆనంద్, లక్ష్మణ్, హరిసింగ్, అంబర్ సింగ్, శ్రీనివాస్, ఉపసర్పంచ్లు దారం బాబు, లడ్డు, మంగ్త్, బాలాగౌడ్, రాములు, శివకుమార్, కరీం, కృష్ణారెడ్డి, అహ్మద్, హనుమంతరావు, మారుతి, రాజు, ముక్తార్, జవహర్ సింగ్, పీర్యా, బాబు, సరిచంద్, సద్దాం, రమేష్, లచ్చిరామ్, వెంకటి, బాలరామ్, గంగాధర్, బాలాజీ, గంగారం, గిరి సవీన్, శంకర్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.