58
అక్షరటుడే, ఇందూరు : GG College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం (Commerce Department) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మార్చిలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి (Principal Dr. Rammohan Reddy) తెలిపారు. “డిజిటల్ వేవ్స్ ఇన్ కామర్స్ – అపర్చునిటీస్ అండ్ చాలెంజర్స్” అనే అంశంపై సెమినార్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగరత్నం వాణిజ్య విభాగాధిపతి వినయ్ కుమార్, ఆయా సబ్జెక్టుల విభాగాధిపతులు డాక్టర్ రంజిత, డాక్టర్ రామస్వామి డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ రామస్వామి, సూపరింటెండెంట్ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.