అక్షరటుడే, ఇందూరు: National Ayurveda Day | పదో జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ఆయుర్వేద పంచకర్మ చికిత్సాలయంలో మంగళవారం విశ్వ ఆయుర్వేద పరిషత్ Vishwa Ayurveda Parishad ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
National Ayurveda Day | ధన్వంతరి పూజ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.జ్యోత్స్న, డా.అరవింద్ పాల్గొని తమ అమూల్యమైన అనుభవాలను పంచుకున్నారు. ఆయుర్వేద బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ వివరించారు. అనంతరం భగవాన్ ధన్వంతరి Dhanvantari పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ Nizamabad జిల్లా విశ్వ ఆయుర్వేద పరిషద్ ప్రధాన కార్యదర్శి డా. కే శ్రీరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు డా. వీ రామకృష్ణ, జిల్లా ఆయుర్వేద వైద్యులు సంతోష్, శ్రీనివాస్, అరుణ, నీతిక, వరలక్ష్మి, అరుణ్, శ్రీలేఖ పాల్గొన్నారు.