HomeUncategorizedMP Shashi Tharoor | దేశం ముందు.. ఆ త‌ర్వాతే రాజ‌కీయాలు.. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్...

MP Shashi Tharoor | దేశం ముందు.. ఆ త‌ర్వాతే రాజ‌కీయాలు.. కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స్ప‌ష్టీక‌ర‌ణ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MP Shashi Tharoor | ప్ర‌పంచ దేశాల ముందు భార‌తీయుల వాణిని బ‌లంగా నొక్కిచెప్ప‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ (Congress leader Shashi Tharoor) అన్నారు. రాజ‌కీయాల కంటే ముందు ప్ర‌పంచ వేదిక‌పై ఇండియా ఐక్య‌త‌ను ప్ర‌ద‌ర్శ‌నే త‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ఉగ్ర‌వాదంతో (Terrorism) పాటు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి ఇండియా వైఖ‌రిని అమెరికా స‌హా ఇత‌ర దేశాల‌కు వెల్ల‌డించేందుకు కేంద్రం నియ‌మించిన అఖిల‌ప‌క్ష ప్ర‌తినిధి బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఆయ‌న త‌న వైఖ‌రిని వెల్ల‌డించారు. అమెరికాకు వెళ్లే ముందు ఆయ‌న కొన్ని మీడియా చాన‌ళ్ల‌తో (Media channels) మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న పర్యటన లక్ష్యాల గురించి, ఇండియా వైఖ‌రి గురించి స్పష్టత ఉందన్నారు. దేశీయ రాజకీయాలు వేరే సంగ‌తి. అది ప‌క్క‌న పెడితే ప్రపంచ వేదికపై మ‌న‌మంతా ఐక్య‌త‌ను ప్రదర్శించడమే త‌న లక్ష్యమ‌ని చెప్పారు.

MP Shashi Tharoor | ప్ర‌జ‌ల దృక్ప‌థాన్ని వెల్ల‌డిస్తాం..

భార‌త దేశ ప్ర‌జ‌ల దృక్ప‌థాన్ని ప్ర‌పంచ దేశాల‌కు వివ‌రిస్తామ‌ని థ‌రూర్ తెలిపారు. ప్రపంచ వేదిక‌ల‌పై భారతదేశ సందేశాన్ని – ఐక్యతా సందేశాన్ని వినిపిస్తామ‌ని అన్నారు. “ప్రభుత్వం (Governament) త‌న ఉద్దేశ్యాన్ని మాకు స్పష్టంగా వివరించింది. మా సందేశం స్థిరంగా ఉంది. ఇక్కడ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అక్కడికి వెళ్లి విదేశాలలో ఉన్న ప్రజలు మన దృక్పథాన్ని అర్థం చేసుకునేలా చూసుకోవడమే లక్ష్యం” అని తెలిపారు.

MP Shashi Tharoor | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం..

వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీల‌తో (All Party MPs) కూడిన ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి థరూర్‌ను నియమించింది. కేంద్రం తీసుకున్న ఈ చర్య అంద‌ర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రతినిధుల (International Delegations) కోసం కాంగ్రెస్ పార్టీ మొదట ప్రతిపాదించిన నలుగురు అభ్యర్థులలో థరూర్ పేరు లేకపోయినప్ప‌టికీ, ఆయ‌న‌ను ఎంపిక చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. కేంద్రం ఉద్దేశాన్ని గుర్తించిన శ‌శిథ‌రూర్‌.. ప్ర‌తినిధి బృందానికి నాయ‌క‌త్వం వ‌హించేందుకు అంగీక‌రించారు. “ఇటీవలి సంఘటనలపై మన దేశం దృక్పథాన్ని ప్రదర్శించడానికి, ఐదు కీలక రాజధానులకు (Five key capitals) అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి భారత ప్రభుత్వం (Indian Governament) ఆహ్వానించడం నాకు గౌరవంగా ఉంది. జాతీయ ఆసక్తి ఇమిడి ఉన్నప్పుడు, నా సేవలు అవసరమైనప్పుడు, నేను క‌చ్చితంగా ముందుంటాను. జై హింద్!” అని సోష‌ల్ మీడియాలో పోస్టులో (Social Media Post) చేశారు.

Must Read
Related News