Homeక్రీడలుWomens World Cup | ప‌రువు పోగొట్టుకున్న పాకిస్తాన్.. ఇలాంటి వింత ఔట్స్ ఆ జ‌ట్టుకే...

Womens World Cup | ప‌రువు పోగొట్టుకున్న పాకిస్తాన్.. ఇలాంటి వింత ఔట్స్ ఆ జ‌ట్టుకే సాధ్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Womens World Cup | మహిళల వన్డే ప్రపంచకప్‌–2025లో భాగంగా గురువారం పాకిస్తాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జ‌ర‌గింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు మాత్రం అన్ని విభాగాల్లో విఫలమైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ నాష్రా సంధు ఊహించ‌ని విధంగా హిట్ వికెట్ అవుట్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. 35వ ఓవర్‌లో షోర్నా అక్తర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని ఆడే ప్రయత్నంలో, నాష్రా సంధు చివరి క్షణంలో బ్యాట్ వెనక్కి తీసుకుంది. కానీ ఆ లోపలే ఆమె బ్యాట్ స్టంప్స్‌ను తాకడంతో హిట్ వికెట్ అవుట్ అయ్యింది.

Womens World Cup | విచిత్ర‌మైన ఔట్స్..

ఇది పాకిస్తాన్ మహిళల వరల్డ్ కప్ (Women’s World Cup) చరిత్రలోనే అరుదైన ఘటనగా నిలిచింది. నాష్రా ముందు, పురుషుల విభాగంలో మిస్బా-ఉల్-హక్, ఇమామ్-ఉల్-హక్ లు ఇలాగే అవుట్ కావడం గమనార్హం. పాక్ బ్యాటింగ్ విఫలమైన తర్వాత, బంగ్లాదేశ్ (Bangladesh) బ్యాటర్ రుబియా హైదర్ క్రీజులో నిలదొక్కుకుని జట్టును గెలిపించింది. 77 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో అజేయంగా 54 పరుగులు చేసి గెలిపించింది. కెప్టెన్ నిగర్ సుల్తానాతో (23) కలిసి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 130 పరుగుల లక్ష్యాన్ని 113 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం బంగ్లాదేశ్ దూకుడును నిరూపించింది.

పాకిస్తాన్ (Pakistan) ఇన్నింగ్స్‌ను పూర్తిగా దెబ్బతీసింది మారుఫా అక్తర్. మొదటి ఓవర్‌లోనే ఓమైమా సోహైల్, సిద్రా అమీన్​లను డకౌట్ చేయడం పాక్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఆ త‌ర్వాత నహీదా అక్తర్ కూడా మునీబా అలీ, రమీన్ షమీమ్​లను ఔట్ చేసి పాక్ కోలుకోకుండా చేసింది. పాకిస్తాన్ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే రుబియా హైదర్ మినహా ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలింగ్​లో అంతా తేలిపోయారు. కేవ‌లం 38.3 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ కావడం పాక్ జ‌ట్టు ఎంత బ‌లంగా ఉందో తెలియ‌జేస్తుంది.. ఫీల్డింగ్‌లోనూ పాక్ అనేక తప్పులు చేసింది. పాకిస్తాన్ స్కోరు: 129 ఆలౌట్ (38.3 ఓవర్లలో) కాగా, బంగ్లాదేశ్ 113 బంతులు మిగిలి ఉండ‌గానే విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించి, పాకిస్తాన్‌ను ఓడించింది.