PM Modi | ఏపీలో ప్ర‌ధాని మోదీ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది.. ఆయ‌న‌కి ఎవ‌రెవ‌రు స్వాగ‌తం ప‌లుకుతారు?
PM Modi | ఏపీలో ప్ర‌ధాని మోదీ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది.. ఆయ‌న‌కి ఎవ‌రెవ‌రు స్వాగ‌తం ప‌లుకుతారు?

అక్షరటుడే, వెబ్​డెస్క్:PM Modi | అమరావతి పున: ప్రారంభకార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీ(AP)కి రానున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో మోదీ రాజధాని అమరావతి(Amaravati)లో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు పీఎం PM Modi శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ(Modi). అయితే మోదీ పర్య‌ట‌న ఎలా సాగుతుంది అంటే.. మే 2 మధ్యాహ్నం 2:55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు.

PM Modi | షెడ్యూల్ ఇదే..

ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో మోదీకి మంత్రులు, కూట‌మి నేతలు స్వాగతం పలుకనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిపాడ్‌కు పీఎం(PM) చేరుకుంటారు. హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు CM Chandrababu Naidu , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Deputy CM Pawan Kalyan ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి చేరుకుని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 గంటలకు తిరిగి హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈ పర్య‌ట‌న‌లో మోదీ(Modi) చేయ‌నున్న శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చూస్తే.. ముందుగా అమరావతిలో అసెంబ్లీ(Assembly), సచివాలయం(Secretariat), హైకోర్టు(High Court) భవనాలతోసహా రూ.49వేల కోట్ల విలువైన 74 ప్రాజెక్టులుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపనలు చేస్తారు. అనంత‌రం రూ.1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రంకు, రూ. 100 కోట్లతో విశాఖలో యూనిటీ మాల్(Unity Mall), రూ. 293 కోట్లతో గుంతకల్లు వెస్ట్ మల్లప్ప రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. రూ.3,176 కోట్లతో NHAI చేపట్టే ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతోపాటు.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఎనిమిది నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభిస్తారు. ఇక బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని వేదికపైన మోదీ సహా 19మంది ఆసీనులవుతారు. వారిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు.