అక్షరటుడే, న్యూఢిల్లీ: Narendra modi comments | ఆసియా కప్‌లో Asia Cup భారత జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా, అన్ని గేమ్‌ల్లో ఆధిపత్యం చాటుతూ ఫైనల్‌లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఈ ఘన విజయంతో దేశవ్యాప్తంగా ఆనందాల హోరు మోగుతోంది. ఫైనల్ పోరులో భారత్ విజృంభించి పాకిస్తాన్‌ని మట్టి కరిపించింది. శర్మ కాకపోతే వర్మ ఉన్నాడంటూ యువ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఆడారు.
ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చివర్లో విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు పహల్గావ్ దాడి Pahalgaon attack లో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు ఈ విజయం అంకితమిచ్చింది.
Narendra modi comments | పాక్‌పై మూడోసారి వరుసగా గెలుపు
ఈ ఆసియా కప్ టోర్నీ Asia Cup tournament లో భారత్ మూడుసార్లు పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. ప్రతిసారి పాక్‌ను సమర్థంగా ఓడించి తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. గెలుపు తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లతో కనీసం హ్యాండ్‌షేక్ Hand Shake కూడా చేయకుండానే తమ వ్యతిరేకతను స్పష్టంగా తెలిపారు.
“ఐసీసీ నిబంధనల ICC rules ప్రకారం మ్యాచ్ ఆడాం.. కానీ, ఇది మాకు ఇష్టమైన పోటీ కాదు” అనే సందేశాన్ని నిర్వాహకులకు గట్టి పాఠంగా చెప్పారు.
గత ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గావ్లో పాక్ ఆధారిత ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.
దీనికి ప్రతిగా భారత్ మే 7 నుంచి 10 వరకూ “ఆపరేషన్ సిందూర్” నిర్వహించి పాక్‌లోని అనేక ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది.
ఆ తర్వాత పాక్ మనపై దాడులకు దిగినా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. పాక్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపి వారిని వెనక్కు నెట్టి వేసింది. అయితే ఆసియా కప్‌లో భారత్ గెలుపు అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ Narendra Modi జట్టు సభ్యులను అభినందించారు.
“యుద్ధభూమిలో అయినా.. క్రికెట్ మైదానంలో అయినా ఫలితం ఒక్కటే.. అది భారత్ విజయమే.. క్రికెట్ మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ Operation Sindoor విజయవంతమైంది,” అంటూ ట్వీట్ చేశారు.
జాతీయ భద్రత కోసం పోరాడిన సైనికుల ప్రేరణతో మైదానంలో భారత ఆటగాళ్లు ఆడారని, ఇది దేశ గౌరవాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. కాగా, మోదీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారత జట్టు ఈ టోర్నీ మొత్తాన్ని దేశం కోసం, అమరుల కోసం అంకితమిచ్చింది. జాతీయత, క్రీడా నైపుణ్యానికి సమ్మేళనంగా నిలిచిన ఈ విజయానికి క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.