HomeUncategorizedPawan Kalyan | ప‌వ‌న్ అలా మాట్లాడ‌డం బాధాకరం.. ఆ ప‌ని చేసి ఉంటే బాగుండేద‌న్న...

Pawan Kalyan | ప‌వ‌న్ అలా మాట్లాడ‌డం బాధాకరం.. ఆ ప‌ని చేసి ఉంటే బాగుండేద‌న్న నారాయ‌ణ మూర్తి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Pawan Kalyan | పీపుల్స్ స్టార్ నారాయ‌ణ మూర్తి(Narayana Murthy) సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తాజాగా థియేటర్ల సమస్యల మీద స్పందిస్తూ… సింగిల్ థియేటర్లు (Single Theatres) ఎదుర్కొంటున్న కష్టాల్ని వివరించారు. అక్కడ కచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు కావాలని అన్నారు. పర్సంటేజీ సిస్టం కోసం పోరాడుతూ బంధ్ ప్రకటిస్తే.. అది హరి హర వీరమల్లుని అడ్డుకునేందుకు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి కందుల దుర్గేశ్ అనడం సరి కాదని ఆర్ నారాయణమూర్తి అన్నారు. పర్సంటేజీ విధానం వస్తుందని, చిన్న సినిమాల్ని తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలగుతాయని అనుకున్నానని నారాయణమూర్తి అన్నారు.

కానీ హరి హర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు థియేటర్ల బంద్‌(Theatres Bandh)ను తెరపైకి తీసుకు వచ్చారని స్వయానా మంత్రి కందుల దుర్గేశ్(Minister Kandula Durgesh) అనడం సరి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పాప్ కార్న్ రేట్, థియేటర్లో టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి సామాన్యుడ్ని సినిమాకు దూరం చేస్తున్నాయని వాపోయారు. అసలు టికెట్ రేట్ల పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారు? ఎందుకు పెంచుతున్నారు? అని ప్రశ్నించారు.డిప్యూపీ సీఎం పవన్ కళ్యాణ్‌పై Deputy CM Pawan Kalyan ఎవరు కుట్ర చేస్తారని ప్రశ్నించారు. పవన్‌పై కుట్ర చేసే దమ్ము ఎవరికీ దమ్ము లేదన్నారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదన్నారు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్‌పై గౌరవం మరింత పెరిగేదని అన్నారు. బంద్ అనేది బ్రహ్మాస్తం అని చెప్పుకొచ్చారు. సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైందని తెలిపారు.

హరిహర వీరమల్లు Harihara veeramallu కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది అని నారాయ‌ణ‌మూర్తి అన్నారు. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. పర్సంటేజిల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్(Chamber Presidents) లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు, మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి అని నారాయ‌ణ మూర్తి స్ప‌ష్టం చేశారు.