Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Town Ci | కామారెడ్డి టౌన్​ సీఐగా నరహరి.. చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు

Kamareddy Town Ci | కామారెడ్డి టౌన్​ సీఐగా నరహరి.. చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kamareddy town CI | రాష్ట్రంలో పలువురు ఇన్​స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మల్టీ జోన్​–1 పరిధిలో ఏడుగురు ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి (IG Chandrasekhar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో భాగంగా కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్​ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయనను ఐజీపీ కార్యాలయానికి అటాచ్​ చేశారు. నూతన సీఐగా వెయిటింగ్​లో ఉన్న బి.నరహరిని నియమించారు. ఆయన గతంలో నిజామాబాద్​ నగర సీఐగా పనిచేశారు. కొద్ది నెలలుగా వెయిటింగ్ లో ఆయనకు తాజాగా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు.

కాగా.. చంద్రశేఖర్​రెడ్డిపై పలు ఆరోపణలు ఉండడంతో బదిలీ వేటు పడినట్లు తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఓ ఉన్నతాధికారితో పాటు పలువురు అధికారులతో సన్నిహితంగా ఉన్న ఈయన ఆ సమయంలో పలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అప్పటి నుంచి ఈయన బదిలీపై ప్రచారం జరిగింది. దీంతో ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా ఐజీపీ కార్యాలయానికి అటాచ్​ చేసినట్లు సమాచారం.

Must Read
Related News