అక్షరటుడే, వెబ్డెస్క్ : Youth Congress | కేరళ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నగరానికి చెందిన నరాల నిహార్ నియమితులయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు డిజిటల్, ఎన్నికల కమ్యూనికేషన్ ప్రచారాన్ని సమన్వయం చేసే బాధ్యతల కోసం ఆయనను నియమించినట్లు నేషనల్ కో ఆర్డినేటర్ మను జైన్ తెలిపారు.
తన నియామకంపై నరాల నిహార్ స్పందించారు. తన నియామకానికి కృషి చేసిన మను జైన్, జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను, జాతీయ ఇన్ఛార్జి మనీష్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావుకు ధన్యవాదాలు తెలిపారు.
