అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tilak Varma | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (Pakistan) ఓడించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
భారత విజయంలో ముఖ్య పాత్ర పోషించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా తిలక్ వర్మని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఫైనల్ మ్యాచ్‌లో ముగ్గురు టాప్ బ్యాటర్లు వెంటవెంటనే ఔటైన సమయంలో క్రీజులో నిలబడిన తిలక్, 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 69 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ విజయంతో తిలక్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
Tilak Varma | ‘లోకేశ్ అన్నా ఇది నీకోసమే..’
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ తన క్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు (Minister Nara Lokesh) కానుకగా పంపించాడు. “లోకేశ్ అన్నా ఇది నీకోసమే.. ప్రేమతో ఇస్తున్నాను” అంటూ క్యాప్‌పై స్వయంగా రాసి సంతకం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, తిలక్ ప్రేమ తనను ఎంతగానో కదిలించిందని పేర్కొన్నారు. ‘‘తమ్ముడూ.. నీ ప్రేమ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు భారత్ తిరిగి రాగానే ఆ క్యాప్‌ను నీ చేతుల మీదుగా అందుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నువ్వు నిజమైన ఛాంపియన్’’ అంటూ ట్వీట్ చేశారు.
తిలక్ వర్మ చాప్టర్ భారత్ విజయగాధలో మరో మైలురాయిగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై ఓ భారీ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం, అలాగే తన వ్యక్తిత్వంలో ఉన్న సరళత, ప్రేమాభిమానాల ప్రదర్శన ఇవన్నీ అతనిని అభిమానుల మనసుల్లో సుస్థిరంగా నిలబెట్టాయి. ఇప్పుడు తిలక్ వర్మ అందరికి రోల్ మోడల్ అవుతున్నాడు. కాగా, ఆసియా కప్‌లో భారత్.. పాకిస్తాన్‌తో మూడు సార్లు తలపడగా, మూడు సార్లు కూడా టీమిండియానే (Team India)పై చేయి సాధించింది.
This made my day, tammudu! 😍 Excited to get it straight from you when you’re back in India, champ!#AsiaCup2025 @TilakV9 pic.twitter.com/hsdEljJ2lS
— Lokesh Nara (@naralokesh) September 29, 2025