అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nara Lokesh | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా యాక్టివిటీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందించే తత్వం ఉన్న నారా లోకేష్(Nara Lokesh)ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సాధారణ ప్రజలు, కార్యకర్తలు తరచూ సంప్రదిస్తుంటారు.
తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్త(YSRCP Leader) నారా లోకేష్‌కు సహాయం కోరగా, మంత్రి కూడా వెంటనే స్పందిస్తూ మానవతా హృదయాన్ని చాటిచెప్పారు. ‘నారా లోకేష్ గారికి ఒక రిక్వెస్ట్.. సీఎంఆర్‌ఎఫ్ విషయంలో మీ సపోర్ట్ కావాలి. మా దగ్గర అన్ని మెడికల్ బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. దయచేసి మాకు సాయం చేయండి’ అంటూ YS Jagan Fans Campaign అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nara Lokesh | లోకేష్ వెంటనే స్పందన
ఈ ట్వీట్‌కు నారా లోకేష్ తక్షణమే స్పందిస్తూ..మీరు నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. సీఎంఆర్‌ఎఫ్ (CMRF) నుంచి మీ రిక్వెస్ట్‌ను నోట్ చేసుకున్నాను. నా టీమ్ వెంటనే ఈ అంశాన్ని పరిశీలిస్తుంది.. మిమ్మల్ని సంప్రదిస్తుంది. అవసరమైన వివరాలు అందించండి” అంటూ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా తన సహాయక టీమ్‌ని అలర్ట్ కూడా చేశారు. లోకేష్ స్పందనను చూసిన నెటిజన్లు, తెలుగు తమ్ముళ్లు ప్రశంసలతో స్పందిస్తున్నారు. “ఇది నిజమైన నాయకత్వ లక్షణం.. పార్టీతో సంబంధం లేకుండా సహాయం చేయడం చాలా గొప్ప విషయం” అని పలువురు వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ట్వీట్‌పై వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగార్జున యాదవ్ స్పందిస్తూ .. ఈ ట్వీట్ చూపించి ఎలేవేషన్ వేసుకునే వాళ్లకు తెలియదేమో.. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్లులు రూ.4 కోట్లు బాకీ ఉన్నప్పుడు, వైఎస్సార్ గారు వచ్చాకే చెల్లించారని అంటూ లోకేష్‌పై విమర్శలు చేశారు. ఒక వర్గం ప్రజలు లోకేష్ మానవతా దృక్పథాన్ని కొనియాడుతుంటే, మరోవైపు కొందరు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కాని రాజకీయాలని పక్కన పెడితే అవసరమైన వారికి, పార్టీ పరంగా కాకుండా, సాయం చేయడం నిజంగా అభినందనీయం అని విశ్లేషకులు చెబుతున్నారు