HomeUncategorizedCM Chandra Babu | తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డు.. శభాష్ ఛాంప్ అంటూ మ‌న‌వ‌డిపై చంద్ర‌బాబు...

CM Chandra Babu | తాత‌కి త‌గ్గ మ‌న‌వ‌డు.. శభాష్ ఛాంప్ అంటూ మ‌న‌వ‌డిపై చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల వ‌ర్షం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ అంతర్జాతీయ స్థాయి(International Level)లో స‌త్తా చాటి తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచాడు.

లండన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక “వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్”(World Book of Records) అవార్డు కార్యక్రమంలో దేవాన్ష్ కీలక గౌరవాన్ని అందుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో దేవాన్ష్ ప్రపంచ వ్యాప్తంగా చెస్‌ ప్రేమికులను ఆశ్చర్యపరిచాడు. కేవలం 9 ఏళ్ల వయసులోనే, అత్యంత క్లిష్టమైన 175 చెక్‌మేట్ పజిల్స్‌ను కేవలం 11 నిమిషాల 59 సెకన్లలో పరిష్కరించి, “ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్” అనే టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఈ అద్భుత ప్రతిభకు గుర్తింపుగా లండన్‌(London)లో జరిగిన వేడుకలో అవార్డు ప్రదానం జరిగింది.

CM Chandra Babu | నారా లోకేశ్, బ్రాహ్మిణి హాజరు

లండన్‌లోని ప్రత్యేక సభకు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh), ఆయన సతీమణి బ్రాహ్మిణి హాజరై, తమ కుమారుడు అందుకున్న గౌరవాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ – లండన్’ నిర్వాహకులు దేవాన్ష్‌కు అవార్డు అందజేశారు. అవార్డు ప్రదానం సందర్భంగా దేవాన్ష్ చెస్‌ రంగంలో చేసిన మరొక రెండు విశేష రికార్డులు కూడా అధికారికంగా గుర్తించబడ్డాయి. ఇవి కూడా అంతర్జాతీయ స్థాయిలో భారత యువ ప్రతిభను ప్రతిబింబించేవిగా నిలిచాయి.ఇంత చిన్న వయసులో ఈ స్థాయిలో ప్రావీణ్యం ప్రదర్శించడం ఎంతో గొప్ప విషయం. దేవాన్ష్ సాధన, నిబద్ధత, వ్యూహాత్మక ఆలోచన తెలుగు యువతకు ప్రేరణగా నిలుస్తోంది. చదరంగం రంగంలో తనదైన ముద్ర వేసేందుకు దేవాన్ష్ ఇంకా ఎన్నో మెట్లు ఎక్కనున్నాడు.

మ‌న‌వ‌డు సాధించిన ఘ‌న‌త ప‌ట్ల సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రౌడ్‌గా ఫీల‌వుతూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు..మా దేవాన్ష్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు 2025 అందుకోవడం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. దేవాన్ష్ నెలల తరబడి చూపిన పట్టుదల, గురువుల మార్గదర్శకత్వం వ‌ల్ల‌నే ఇలాంటి విజ‌యం సాధించాడ‌ని చంద్ర‌బాబు అన్నారు. దేవాన్ష్ సాధించిన ఈ విజ‌యం ఎంద‌రికో స్పూర్తిదాయ‌కం అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన దేవాన్ష్‌(Nara Devansh)ను ‘శభాష్ ఛాంప్’ అంటూ ప్ర‌శంసించ‌డం గ‌మ‌న‌ర్హం. అంతర్జాతీయ వేదికపై దేవాన్ష్ ప్రతిభకు గుర్తింపు లభించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వరల్డ్ లీడర్  అయితే ఆయన మనవడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ అంటూ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.