అక్షరటుడే, వెబ్‌డెస్క్ : The Paradise | నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా హిట్ 3 చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న నాని ఇప్పుడు ది పారడైజ్ అనే చిత్రం చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో ఫెయిల్యూర్లను జయించి, మిడిల్ రేంజ్ హీరో నుండి స్టార్ హీరోల లీగ్‌లోకి ఎంటర్ అయ్యాడు నాని(Hero Nani). ఇప్పుడు అతను నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ చిత్రం(The Paradise Movie) ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమా ద్వారా దసరా బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల – నాని కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఇప్పటికే ది ప్యారడైజ్ షూటింగ్ ప్రారంభమై శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
The Paradise | వెయిటింగ్…
ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. “కాకుల కథ” అంటూ ఓ మహిళ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దసరా లో తన నటనతో విశ్వరూపం చూపించిన నాని, ఈసారి ది ప్యారడైజ్ ద్వారా మరోసారి నట విశ్వరూపానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గా నాని మీడియాలో కనిపించగా, ఆయన లుక్ చూసిన అభిమానులు ఫిదా అయ్యారు. దసరా కంటే గంభీరంగా, రగ్గడ్ లుక్‌తో మళ్లీ మెస్మరైజ్ చేశాడు. గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించాడు. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని రెండు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడట. ఒక లుక్ ఇప్పటికే క్లీన్ షేవ్‌లో విడుదల కాగా, మరొక రగ్గడ్ లుక్‌ను త్వరలోనే విడుదల చేస్తారనే ప్రచారాలు నడిచింది.
తాజాగా చిత్ర బృందం ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ చేసింది. ఆగస్టు 8న మూవీ ఫస్ట్ లుక్ (Movie First Look) విడుదల చేయనున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టర్‌లో మూవీ రిలీజ్ డేట్ కూడా చెప్పారు. మార్చి 26,2026న చిత్రం రిలీజ్ కానుందంటూ తెలియజేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని ఈ సినిమా ద్వారా మరో ఘనవిజయం అందుకుంటాడా అనే ఆసక్తి సినిమా లవర్స్‌లో మరింత పెరిగింది.