HomeUncategorizedNani | పాపం ఈ హీరోకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి.. ముసుగు వేసుకొని వెళ్లి రెండు...

Nani | పాపం ఈ హీరోకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంటి.. ముసుగు వేసుకొని వెళ్లి రెండు సినిమాలు చూశాడా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nani | నిన్న (ఆగస్ట్ 14) బాక్సాఫీస్‌ను ఊపేసిన రెండు భారీ సినిమాలు సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున నటించిన ‘కూలీ’ (Coolie Movie) మరియు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్ 2’(War 2). ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడంతో, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది.ఈ రెండు సినిమాల కోసం అభిమానులు థియేటర్లకి భారీగా తరలివచ్చారు. సెల‌బ్రిటీలు సైతం ఈ సినిమాలు చూసేందుకు ఆస‌క్తి చూపించారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్ థియేటర్‌(AMB Mall Theater) కు వెళ్లి, ఈ రెండు సినిమాలను వీక్షించారు.

Nani | ఫేస్ క‌వ‌ర్ చేసుకొని..

అయితే ఈ సినిమాలు చూసేందుకు ఆయన ముఖాన్ని పూర్తిగా మాస్క్‌తో కవర్‌ చేసుకొని, సీక్రెట్‌గా థియేటర్‌కి వెళ్లారు. తన‌ని ఎవ‌రు గుర్తు ప‌ట్ట‌కుండా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ సందర్భంగా నానికి(Hero Nani)సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఆయన మాస్క్ లుక్‌ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం నాని, ‘దాస్ కా ధమ్కీ’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన స్పెషల్ టీజర్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాపై అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

ఇక నాని నేచురల్ స్టార్ నాని ఇప్పుడు హీరోగా కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు నాని. ఇక హీరోగా నాని హిట్ 3 HIT 3 సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం కూడా మంచి విజ‌యాన్ని సాధించింది. త్వ‌ర‌లో ది ప్యారడైజ్ చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో నాని లుక్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అలానే ప‌ర్‌ఫార్మెన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు.