అక్షరటుడే, వెబ్డెస్క్: Nandikonda Municipal Results | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణి కొట్టింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటిని కైవసం చేసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal elections) కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది.
ఇప్పటి వరకు రెండు బల్దియాల తుది ఫలితాలు విడుదల కాగా.. అందులో బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి గెలుపొందడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) గడ్డ పోతారంలో బీఆర్ఎస్ విజయం సాధించగా.. నల్గొండ జిల్లా (Nalgonda district) నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా.. ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు.
Nandikonda Municipal Results | ఆధిక్యంలో కాంగ్రెస్..
పురపోరులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 147 వార్డుల్లో, బీఆర్ఎస్ 72, బీజేపీ 17 స్థానాల్లో గెలుపొందాయి. మెదక్లో 6, కాంగ్రెస్ 4, బీజేపీ ఒక చోట విజయం సాధించాయి. మధిరలో టీడీపీ (TDP) అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. బాన్సువాడ 12వ వార్డు స్వతంత్ర అభ్యర్థి, 9వ వార్డు బీజేపీ, 13వ వార్డు కాంగ్రెస్ గెలుపొందారు.