అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nandamuri Jayakrishna | ఇటీవలి కాలంలో టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నెల క్రితం కోట శ్రీనివాస్ మరణించగా, ఆ తర్వాత పలువురు ప్రముఖుల మరణించారు. ఇక నిన్న కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు.
ఆ వార్త నుంచి తేరుకునేలోపు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (Padmaja) (62) అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో (Hyderabad Private Hospital) చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్ను మూశారు.
Nandamuri Jayakrishna | మరో విషాదం..
పద్మజ.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా సోదరి. అలాగే, సినీ నటుడు నందమూరి చైతన్య కృష్ణకు తల్లి. ఈ విషాద వార్తతో నందమూరి, దగ్గుబాటి కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఇక పద్మజ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో (AP CM Chnadra Babu Naidu) పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పద్మజ అంత్యక్రియలు హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించనున్నట్టు సమాచారం.
సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, తనదైన ముద్ర వేసుకున్న గొప్ప నాయకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) బసవతారకంను వివాహం చేసుకోగా, వీరికి 7 మంది కొడుకులు, నలుగురు కుమార్తెలు జన్మించారు. తెలుగు భాష, హిందూ సంప్రదాయాల పట్ల ఎన్టీఆర్‌కు గల ప్రేమ, గౌరవం ఆయన పిల్లలకు పెట్టిన పేర్లలో స్పష్టంగా కనిపిస్తుంది. కొడుకుల పేర్లు చివర “కృష్ణ” అనే పదం వస్తుంది. నందమూరి హరికృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి సాయికృష్ణ, నందమూరి జయకృష్ణ (Nandamuri Jayakrishna), నందమూరి బాలకృష్ణ. ఇక కూతుర్లకు చివర ఈశ్వరి వచ్చేలా పేర్లు పెట్టారు. లోకేశ్వరి, పురంధేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి ఇలా పేర్లు పెట్టారు.