Taraka Rama Rao | ఎన్టీఆర్ ముని మనవడు జానకీరామ్ తనయుడు తారక రామారావు హీరోగా మూవీ లాంచ్
Taraka Rama Rao | ఎన్టీఆర్ ముని మనవడు జానకీరామ్ తనయుడు తారక రామారావు హీరోగా మూవీ లాంచ్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Taraka Rama Rao | ఇటీవ‌ల ఇండ‌స్ట్రీకి వార‌సుల తాకిడి ఎక్కువైంది. హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల వార‌సులు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. తారక రామారావు(Taraka Rama Rao) హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో కొత్త సినిమాను ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరిలతో పాటు ఎన్టీఆర్‌ NTR ఫ్యామిలీ సభ్యులు హాజ‌ర‌య్యారు. ఈ మేరకు నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టి నటీనటులను అభినందించారు. కాగా ఈ చిత్రాన్ని ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ (New Talent Roars) పతాకంపై నిర్మిస్తున్నారు.

Taraka Rama Rao | కొత్త హీరో..

వైవీఎస్ చౌదరి(YVS Chowdhary).. ఈ పేరు ఇప్పటి తరం వారికి అంతగా తెలియ‌దు కాని, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ లాంటి సూపర్ హిట్ మాస్ చిత్రాలను తెరకెక్కించింది ఈయనే అని గుర్తు చేస్తే తెలుస్తుంది. ఎంతోమంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao) కుటుంబం నుండి మరో కొత్త నటుడిని పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ నట వారసుల్లో నాలుగో తరం, నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్‌ Janaki Ram కుమారుడు అయిన నందమూరి తారక రామారావు(జూనియర్ ఎన్టీఆర్ కాదు) హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.

న్యూ టాలెంట్ రోర్స్‌ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్‌గా నటించనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి Keeravani సంగీతం అందించనుండగా, చంద్రబోస్ సాహిత్యం సమకూరుస్తున్నారు. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు. నేడు తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్‌లో పూజ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. భువనేశ్వరి క్లాప్‌కొట్టి సినిమాను ప్రారంభించింది. కాగా.. నందమూరి కుటుంబం నుండి వస్తున్న మరో వారసుడు కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.