HomeUncategorizedBala Krishna | బాల‌కృష్ణ‌కి అనారోగ్యం.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

Bala Krishna | బాల‌కృష్ణ‌కి అనారోగ్యం.. ఆందోళ‌న చెందుతున్న అభిమానులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bala Krishna | ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) వెల్లడించారు.

అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన “సూపర్ సిక్స్… సూపర్ హిట్”(Super Six… Super Hit) సభలో పాల్గొన్న పయ్యావులు మాట్లాడుతూ ..“ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, నారా లోకేశ్(Nara Lokesh) ఇద్దరూ రావాల్సింది. కానీ బాలయ్యగారు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారు,” అని చెప్పారు. అయితే బాలకృష్ణకు ఏమైంది అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. బాలయ్య అనారోగ్యం వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువ‌డుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Bala Krishna | బాల‌య్య‌కి ఏమైంది..

ఇక నారా లోకేశ్ సభకు రాకపోవడానికి గల కారణాన్ని కూడా పయ్యావుల స్పష్టం చేశారు. నేపాల్‌(Nepal)లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి రక్షణ కోసం లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. “లోకేశ్ ప్రస్తుతం సచివాలయం నుండి నేపాల్ పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. అందుకే ఈ సభకు ఆయన రాలేకపోయారు,” అని వివరించారు. అయితే బాల‌య్య(Bala Krishna) అనారోగ్యం గురించి పూర్తి క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్‌లో టెన్ష‌న్ మొద‌లైంది.

ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2: తాండవం అనే భారీ బ‌డ్జెట్ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ‘అఖండ’ సీక్వెల్ గా రూపొందుతుంది. డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానున్న‌ ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ కావ‌డంతో ఇప్పుడు ‘అఖండ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా నెట్టింట జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ. 80 – 85 కోట్ల మధ్య డీల్ క్లోజ్ చేసుకున్న‌ట్టుగా టాక్ న‌డుస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Must Read
Related News