అక్షరటుడే, హైదరాబాద్: Nampally Numaish | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం ప్రారంభం అయింది. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కొనసాగుతోంది. దీనిని జనవరి 1న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగనుంది. నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు.. శని, ఆదివారం, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. దీని ఎంట్రీ ఫీజు రూ.50గా నిర్ణయించారు. ఈసారి నుమాయిష్లో 1050 స్టాళ్లు ఉన్నాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యా సంస్థలను నడుపుతున్నారు.
Nampally Numaish |
గ్రేటర్ హైదరాబాద్ మహిళల కోసం నుమాయిష్ Nampally Numaish లో ప్రత్యేక రోజు కేటాయించబోతున్నారు. ఎగ్జిబిషన్ (AIIE) లో ఏటా మహిళల కోసం లేడిస్ డే స్పెషల్ ఉంటుంది. కాగా, ఈసారి జనవరి 6 (మంగళవారం) (Ladies Day celebrations 2026) న లేడిస్ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు.
అంటే ఆ రోజు పదేళ్ల లోపు అబ్బాయిలను మినహా.. మగవారినెవరినీ నుమాయిష్లోకి అనుమతించరు. ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) డాక్టర్ కె శిల్పవల్లి పాల్గొంటారు.
మహిళల కోసం ప్రత్యేక రోజును కేటాయించడమనేది ఈనాటిది కాదు. 1940లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సంప్రదాయాన్నిస్టార్ట్ చేశారని చరిత్ర చెబుతోంది.