అక్షరటుడే, ఎల్లారెడ్డి: Municipal Elections | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy municipality) పరిధిలోని పలు వార్డుల్లో మృతి చెందిన వారి పేర్లను తొలగించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీవో పార్థసింహారెడ్డికి (RDO Parthasimha Reddy) వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చాలా వరకు ఓటర్ల పేర్లు వార్డులు మారాయని.. వెంటనే వాటిని సవరించాలని కోరారు.
Municipal Elections | దొంగ ఓట్లు ఉన్నాయ్..
కొన్ని వార్డుల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని, వాటిని సైతం జాబితా నుంచి తొలగించాలని బీజేపీ సూచించారు. పట్టణంలోని 7, 10వ వార్డులోని ఓట్లు ఒకటో వార్డులోకి వెళ్లాయన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా ఓటరు జాబితాను తయారు చేయాలని వారు విన్నవించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలకిషన్, దేవేందర్, నర్సింలు, రాజేష్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.