ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి

    Namdev Maharaj | భక్తిశ్రద్ధలతో నాందేవ్ మహారాజ్ పుణ్యతిథి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Namdev Maharaj | పోతంగల్ (Pothangal) మండలంలోని దోమలేడిగి (Domaledgi) గ్రామంలోని విఠలేశ్వర మందిరంలో (Vitthaleshwara temple) నాందేవ్​ మహారాజ్​ పుణ్యతిథి, ఆలయ రెండో వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. మేరుకు కులస్థుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పుణ్యతిథి వేడుకలు జరిపించారు.

    Namdev Maharaj | భజనలు.. కీర్తనలు..

    ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేయగా.. 9 గంటలకు కామప్ప మహారాజ్ (Kamappa Maharaj) ఆధ్వర్యంలో భజన కీర్తనలు నిర్వహించారు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన మహాభక్తుడు నాందేవ్ మహారాజ్ అని ఆయన పేర్కొన్నారు. 12 గంటలకు గులాలు నిర్వహించి ప్రధాన వీధుల ద్వారా పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో గంట్ల రవి కుమార్, జెల్లా గంగాధర్, శ్రీధర్, విఠల్, రాములు, మేరు బంధువులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...

    Kaloji Narayana Rao | ఘనంగా ప్రజాకవి కాళోజీ జయంతి

    అక్షరటుడే, ఇందూరు: Kaloji Narayana Rao | ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు....