అక్షరటుడే, వెబ్డెస్క్: Nallamala Forest Fire | నల్లమల అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. నాగర్ కర్నూల్ జిల్లా (Nagarkurnool District) అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని బ్రహ్మగిరి రేంజ్ (Brahmagiri Range) పరిధిలో మంటలు అంటుకున్నాయి.
బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సమీపంలో నిప్పు రాజుకుంది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించాయి. తవిసిపెంట, వజ్రాలమడుగులలో వందల హెక్టార్లలో మంటలు అంటుకున్నాయి. శ్రీశైలం-హైదరాబాద్ (Srisailam-Hyderabad) హైవే నుంచి మూడు కిలోమీటర్ల మేర విస్తరించాయి. సమాచారం అందుకున్న అటవీ, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. గడ్డి ఏపుగా పెరగడం, కొండలు, లోయలు ఉన్న ప్రాంతం కావడంతో మంటలు ఆర్పడానికి ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
Nallamala Forest Fire | జాగ్రత్తలు అవసరం
ఎండాకాలం సమీపిస్తోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) పెరిగాయి. అడవుల్లో ఆకు రాలిపోతుంది. దీంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం మంటలు అంటుకొని వేలాది చెట్లు కాలిబూడిద అవుతున్నాయి. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎండిన ఆకులు, గడ్డితో వేగంగా మంటలు వ్యాపిస్తాయి. ఈ క్రమంలో ఎండిన ఆకును కుప్పలుగా చేసి కాల్చివేయాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. అక్కడక్కడ ఇలా ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తే మంటలు వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే రోడ్డుకు సమీపంలో ప్రజలు వంట చేసుకోవడం, చెత్త తగులబెట్టడం, సిగరెట్, బీడీ పీకలు పడేడయం లాంటి కారణాలతో మంటలు అంటుకుంటున్నాయి. రోడ్డుకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో తరచూ ఎండిన ఆకులను తొలగించాలి. అలాగే అటవీ ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలి.