Homeజిల్లాలుకామారెడ్డిLingampet mandal | డీసీసీ రేసులో నల్లమడుగు షరీఫ్‌

Lingampet mandal | డీసీసీ రేసులో నల్లమడుగు షరీఫ్‌

కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నానని లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన షరీఫ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, లింగంపేట: Lingampet mandal | కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రేసులో (DCC president Race) తానున్నానని లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన షరీఫ్‌ తెలిపారు. ఏఐసీసీ అబ్జర్వర్‌ రాజ్‌పాల్‌ను బుధవారం కలిసి దరఖాస్తును అందజేసినట్లు పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా (Kamareddy district) ప్రచార కమిటీ జనరల్‌ సెక్రెటరీగా, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, లింగంపేట్‌ మండల అధ్యక్షుడిగా, డీసీసీ జనరల్‌ సెక్రెటరీగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. ఈ మేరకు వీటిని పరిగణనలోకి తీసుకుని, మైనార్టీ కోటాలో తనకు డీసీసీ అధ్యక్ష పదవికి అవకాశం ఇవ్వాలని కోరారు.