అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nalgonda Smart City Plan | ప్రజల సహకారంతో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు పర్యటించారు.
నల్గొండ కార్పొరేషన్(Nalgonda Corporation) పరిధిలోని ప్రకాశం బజార్, లతీఫ్ షాప్ గుట్ట తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ప్రకాశం బజార్ (Prakasam Bazaar)కు ప్రతిరోజూ నిత్యం 10 వేల మంది వస్తారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, వ్యాపారాలకు అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని తెలిపారు.
Nalgonda Smart City Plan | వ్యాపారులను తరలించాలి
ఫుట్‌పాత్‌లపై ఉన్న పూలు, పండ్లు, చిన్న వ్యాపారాలను పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలానికి తరలించాలని ఆదేశించారు. ఏ వ్యాపారికి అన్యాయం జరగకుండా, ఉపాధి దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపిస్తామన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో భూగర్భ విద్యుత్ వ్యవస్థ (Underground Cabling) ఏర్పాటు చేస్తామన్నారు.