అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nalgonda Corporation Results | నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Municipal Corporation)ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 48 డివిజన్లు ఉండగా.. కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 2, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాల్లో విజయం సాధించారు.
నల్గొండ ఇటీవల కార్పొరేషన్‌గా మారిన విషయం తెలిసిందే. తొలిసారి జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయకేతనం ఎగురవేసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సైతం ఆ పార్టీ గెలుపొందింది. చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. నందికొండలో 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా.. ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాయి.
Nalgonda Corporation Results | మూడు పార్టీలకు సమానం..
వనపర్తి జిల్లా (Wanaparthy District) అమరచింత మున్సిపాలిటీలో ఆసక్తికర ఫలితం వచ్చింది. మూడు పార్టీలకు మూడేసి సీట్లు వచ్చాయి. మొత్తం పది వార్డులు ఉండగా.. బీజేపీ-3, బీఆర్ఎస్-3, కాంగ్రెస్-3, ఇండిపెండెంట్-ఒక చోట విజయం సాధించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ పదవి కోసం 6 సీట్లు కావాలి. దీంతో ఏ రెండు పార్టీలు కలుస్తాయనే ఉత్కంఠ నెలకొంది.
Nalgonda Corporation Results | ఇస్నాపూర్‌లో ఉద్రిక్తత
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఇస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 4 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ కోసం బీఆర్ఎస్కు రెండు, కాంగ్రెస్‌కు 4 సీట్లు అవసరం. దీంతో స్వతంత్ర అభ్యర్థులను కౌంటింగ్ సెంటర్ నుంచి క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీల యత్నించాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.