అక్షరటుడే, వెబ్డెస్క్: Nalgonda Municipal Results | నల్గొండ జిల్లా (Nalgonda District)లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.నల్గొండ జిల్లాలోని చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ మున్సిపాలిటీ (Nandikonda Municipality)ల్లో హస్తం విజయం సాధించింది. నందికొండలో 12 వార్డులకు గానూ 11 వార్డుల్లో కాంగ్రెస్ గెలవగా.. ఒక చోట బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాయి.
Nalgonda Municipal Results | కోహీర్లో హంగ్
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ గెలుచుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 14 చోట్ల బీఆర్ఎస్, 4 వార్డుల్లో కాంగ్రెస్
2 వార్డుల్లో బీజేపీ, 1 వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో హాంగ్ ఏర్పడింది. 16 వార్డులకు 8 వార్డుల్లో కాంగ్రెస్, 5 వార్డుల్లో బీఆర్ఎస్, 1 వార్డులో బీజేపీ, ఒక వార్డులో ఎంఐఎం, ఒక వార్డులో ఇండిపెండెంట్ విజయం సాధించారు. అయితే మెజారిటీకి ఒక్క స్థానం మాత్రమే తగ్గడంతో కాంగ్రెస్ ఈజీగా ఛైర్పర్సన్ పదవి దక్కించుకోనుంది. గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీని గులాబీ పార్టీ దక్కించుకుంది. 20 వార్డుల్లో 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం సాధించారు.ములుగు, అశ్వారావుపేట, డోర్నకల్, మరిపెడ, చొప్పదండి, మధిరలో కాంగ్రెస్ విజయం సాధించింది.
1 comment
[…] | భీమ్గల్లో ఆధిక్యంలో కాంగ్రెస్.. Nalgonda Municipal Results | నల్గొండలో కాంగ్రెస్ జోరు… Nizamabad Postal Ballot Results | పోస్టల్ బ్యాలెట్లలో […]
Comments are closed.