అక్షరటుడే, ఆర్మూర్ : DSP Madhusudhan | నాయక్‌పోడ్ కులస్థులు ఐక్యంగా ఉండి అన్ని రంగాల్లో రాణించాలిన డీఎస్పీ మధుసూదన్ (DSP Madhusudhan) అన్నారు. మండలంలోని చేపూర్లో భీమన్న గుడిలో ఆదివాసి నాయకపోడ్ ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమిని (Kartik Purnima) పురస్కరించుకొని భీమన్న కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జిల్లాస్థాయి ఆదివాసీ నాయక్ పోడ్ కబడ్డీ పోటీలను (Kabaddi Competition) డీఎస్పీ మధుసూదన్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సాయన్న (Deputy CEO Sayanna), ఆదివాసి నాయక్ పోడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, గౌరవ అధ్యక్షుడు బండారి భోజన్న ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి కోసెడుగు రవి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కాంగ్రెస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ జడ్పీటీసీ సారంగి నడిపి సందన్న, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.గంగాధర్, చేపూర్ మాజీ సర్పంచులు పి .సత్యనారాయణ, కె.గంగారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ ఇందూర్ సాయన్న, మాజీ ఎంపీటీసీ గంగాధర్, ఆర్మూర్ మండల ఆదివాసి నాయక్‌పోడ్, ప్రధాన కార్యదర్శి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
