అక్షరటుడే, లింగంపేట : ACB | కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం (Nagireddypet mandal) తహశీల్దార్ యార్లగడ్డ శ్రీనివాస్ రావు ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ వ్యక్తి వ్యవసాయ భూమిని తన పేరున బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కాగా.. బదిలీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని తహశీల్దార్ (Tahsildar) డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం రూ. 50వేల లంచం డబ్బులు అజయ్ అనే ప్రైవేటు వ్యక్తి తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాస్ రావు, ప్రైవేటు వ్యక్తి అజయ్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు.
ACB | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు.