అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagireddypet | ఆపదలో ఉన్న వ్యక్తికి ఆపన్నహస్తం అందించి ఓ ఎస్సై మానవతా దృక్పథం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని దేవనపల్లి గేట్ సమీపంలో బుధవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి ఒ వ్యక్తి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. అక్కడే ఉన్న ఎస్సై భార్గవ్ గౌడ్ (SI Bhargav Goud) వెంటనే స్పందించారు.
పోలీస్ వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి (YellaReddy Government Hospital) తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. ఉదయం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. నాగిరెడ్డిపేట వెళ్తున్న క్రమంలో తన కళ్లెదుటే వ్యక్తి గాయపడడంతో, తనవంతుగా స్పందించినట్లు పేర్కొన్నారు.

