Homeక్రైంNagarkurnool | పెళ్లి కోసం హత్యతో లస్ట్​ బంధాన్ని తెంచుకున్నాడు.. ఎలా అంటే..!

Nagarkurnool | పెళ్లి కోసం హత్యతో లస్ట్​ బంధాన్ని తెంచుకున్నాడు.. ఎలా అంటే..!

పెళ్లి బంధాన్ని తెంచుకుని ఒంటరిగా ఉన్న మహిళను బుట్టలో వేసుకున్నాడు. అక్రమ బంధం కొనసాగించాడు. మరో అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. అక్రమ లవర్​ ప్రేమ వ్యవహారం తెలిసి తననే పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసిన ఆ ఏకాకి మహిళను అంతమొందించాడు. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagarkurnool | పెళ్లి marriage బంధాన్ని తెంచుకుని ఒంటరిగా ఉన్న మహిళ (woman) ను బుట్టలో వేసుకున్నాడు. అక్రమ బంధం కొనసాగించాడు. మరో అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. అక్రమ లవర్​ ప్రేమ వ్యవహారం తెలిసి తననే పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసిన ఆ ఏకాకి మహిళను అంతమొందించాడు.

తెలంగాణ Telangana లోని నాగర్ కర్నూల్ జిల్లా Nagarkurnool district పెంట్లవెళ్లి పరిధిలో అక్టోబరు 8వ తేదీన ఓ మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో వెలుగు చూసింది. మృతదేహం కాలిపోయిన స్థితో ఉండటంలో ఎలాంటి ఆనవాళ్లు లభించని పరిస్థితి.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని మూడు వారాల్లోనే పట్టుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.

ప్రియురాలిని వివాహం చేసుకోకుండా అడ్డుపడుతున్న తనతో శారీరక సంబంధం కొనసాగిస్తున్న మహిళను అంతమొందించినట్లు నిందితుడి అంగీకరించాడు. పోలీసుల వివరాల ప్రకారం..

కొల్లాపూర్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న స్వర్ణలత అనే మహిళ టైలరు పని చేస్తూ జీవనం సాగిస్తోంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె గత ఏడు సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటోంది.

కాగా, అదే కాలనీలో ఉంటున్న విజయ్ కుమార్‌(23)తో స్వర్ణలతకు పరిచయం ఏర్పడింది. అయితే, విజయ్​ కంటే స్వర్ణలత సుమారు 15 ఏళ్లు పెద్దది కావడం గమనార్హం. అయినా ఇద్దరూ హద్దులు దాటి, శారీరకంగా ఒక్కటయ్యారు.

ఇదిలా ఉండగా.. విజయ్ మరో అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఈ విషయం స్వర్ణలతకు తెలిసింది.

ఇక విజయ్​ను వేధించడం మొదలెట్టింది. ఆ అమ్మాయిని దూరం పెట్టాలని, తననే పెళ్లి చేసుకోవాలని స్వర్ణలత వెంటపడింది. లేదంటే ఇద్దరి మధ్య అక్రమ వ్యవహారం పేరెంట్స్​కు చెబుతానని బెదిరించింది.

ఇలా బ్లాక్ మెయిల్‌ చేయడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని విజయ్​ ప్రణాళిక రూపొందించాడు. స్వర్ణలతను కృష్ణా నదీతీరంలోని మంచాలకట్టకు తీసుకెళ్లాడు.

అక్కడి నుంచి ఆమెను సాకలి రాముని గుట్టపైకి పట్టకెళ్లాడు. అక్కడ మాటల్లో పెట్టి, ఆమె గొంతి పిసికి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. అనంతరం స్వర్ణలత మృతదేహాన్ని పెట్రోల్​ పోసి తగలబెట్టి, అక్కడి నుంచి పారిపోయాడు.

Nagarkurnool | మేకల కాపర్లు గుర్తించి..

అక్టోబరు 13వ తేదీన మృతదేహాన్ని మేకల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. విలేజ్​ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతదేహం పూర్తిగా కాలిపోవడం, చుట్టు పక్కల ప్రాంతాల్లో మిస్సింగ్ కేసు లేకపోవడంతో పోలీసులకు కేసు ఛేదన సవాలుగా మారింది.

తన కూతురు స్వర్ణలత కనపించడం లేదని పోలీసులకు ఆమె తండ్రి  ఫిర్యాదు చేశాడు. మృతదేహం వద్ద దొరికిన గాజులు, ఇతర వస్తువులు చూసి, తన కూతురే అని గుర్తుపట్టాడు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతికంగా ఆధారాలు సేకరించి నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకోగా.. అక్రమ బంధం వెలుగుచూసింది. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడిని కోర్టులో హాజరుపర్చి, రిమాండ్​కు తరలించారు.