NAGARJUNA
Akkineni Nagarjuna | వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించేందుకు రేవంత్ రెడ్డిని క‌లిసిన నాగార్జున దంప‌తులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Akkineni Nagarjuna | గ‌త ఏడాది అక్కినేని కుటుంబంలో (Akkineni Family) పెళ్లి వేడుక జ‌రిగిన విష‌యం తెలిసిందే. అక్కినేని నాగ చైత‌న్య‌, శోభిత‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఏడ‌డుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

ఇక ఇప్పుడు అఖిల్(Akkineni Akhil) పెళ్లికి స‌మ‌యం ఆసన్న‌మైంది. గత సంవత్సరం నవంబర్ లో అక్కినేని అఖిల్ జైనబ్ రవ్‌డ్జీ(Zainab Ravji) ని నిశ్చితార్థం చేసుకోగా, నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించాడు. జైనబ్ రవ్‌డ్జీ, అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. యువ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతుండ‌గా, ఆయ‌నికి ఇప్పటి నుండే శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది.

Akkineni Nagarjuna | మ‌రి కొద్ది రోజుల‌లోనే వివాహం..

ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె జైనబ్ రవ్‌డ్జీతో అఖిల్ (Akkineni Akhil) వివాహం జరగనుంది. ఈ పెళ్లి జూన్ 6న జరగనుందనే వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ లేదా రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి పెళ్లి జరుగుతుందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. కేవలం ఇటు కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్యే ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అక్కినేని ఫ్యామిలీ ఈ రూమర్ పై స్పందిస్తుందేమో చూడాలి. అయితే తాజాగా నాగార్జున దంప‌తులు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిసి తమ కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని అందించారు. ఆ మ‌ధ్య నాగార్జున‌- రేవంత్ రెడ్డి మ‌ధ్య వైరం నెల‌కొందనే ప్ర‌చారాలు న‌డిచాయి.

కాని ప్రపంచ సుందరి – 2025 పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) ఆతిథ్యమివ్వ‌గా, ఆ విందుకి నాగార్జున‌ని కూడా ఆహ్వానించారు. ఆ స‌మ‌యంలో రేవంత్ రెడ్డి Revanth Reddy, నాగార్జున ప‌క్క ప‌క్కనే కూర్చున్నారు. ఇక నాగార్జున ఆహ్వానాన్ని మ‌న్నించి రేవంత్ రెడ్డి.. అఖిల్ పెళ్లికి త‌ప్ప‌క హాజ‌రు కానున్నార‌ని అంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖిల్ లెనిన్ సినిమా చేస్తున్నాడు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.